Corona Vaccine in Nellore: Krishnapatnam Ayurvedic Medicine: సీఎం జగన్ కీలక నిర్ణయం.. రంగంలోకి ICMR - ap cm ys jagan key decision on krishnapatnam ayurvedic medicine
Anandaya, Krishnapatnam Corona Medicine: ఏపీలో సంచలనంగా మారిన కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Anandaya Corona Medicine: ఏపీలో సంచలనంగా మారిన కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కృష్ణపట్నం కరోనా మందు సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న కరోనా మందు దివ్య ఔషధంలా పనిచేస్తోందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరగడంతో కరోనా బాధితులు వేల సంఖ్యలో క్యూ కట్టారు. కోవిడ్ బారినపడి ఆస్పత్రుల్లో లక్షలు ధారపోసినా ప్రయోజనం లేదని.. ఆనందయ్య కరోనా మందు తీసుకున్న గంటలు, రోజుల్లోనే నయమైపోయిందంటూ కొందరు రోగులు చెబుతున్న వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆనందయ్య మందుకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. కరోనాకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై అనుమానాల నివృత్తి కోసం సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం జరగాలన్నారు. అధ్యయనం కోసం ఐసీఎంఆర్ బృందాన్ని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పంపించాలని ఆయన ఆదేశించారు. ఈ రోజు సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరు వెళ్లే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
ఇప్పటికే ఆనందయ్య ఆయుర్వేద మందుకి ఆయుష్ శాఖ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయుర్వేద మందు ప్రమాణాలకు లోబడి ఉందని.. హానికరం కాదని ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేసింది. దీంతో ఆయుర్వేద మందు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈరోజు మందు పంపిణీ చేస్తారని తెలియడంతో వేల సంఖ్యలో బాధితులు కృష్ణపట్నానికి క్యూ కట్టారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి దగ్గరుండి మరీ ఆయుర్వేద మందు పంపినీ చేశారు. అయితే జనం భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. కనీస సామాజిక దూరం.. కరోనా నిబంధనలు పాటించకపోవడంతో తాత్కాలికంగా ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించి వెనుదిరిగారు. అయితే ఐసీఎంఆర్ నివేదిక వచ్చిన తరువాతే ఆనందయ్య మందు పంపిణీపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Source:Telugu.samayam.com